Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో రూపొందుతున్న బహు భాషా చిత్రం 'సేవాదాస్'. ఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్.చౌహాన్, ప్రీతి అస్రాని హీరో, హీరోయిన్లు. బంజారా, తెలుగు,ఇంగ్లీష్, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఏఎమ్బి మాల్లో ఘనంగా జరిగింది. ఆలిండియా ఆదివాసీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బెల్లయ్య నాయక్, లంబాడి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ చౌహాన్, తెలంగాణ గవర్నమెంట్ సెక్రటరీ భూక్య భారతి, ఐ.ఎ.ఎస్., ఐ.టి.కమిషనర్ పీర్యా నాయక్, లంబాడి ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త రమేష్ నాయక్ తదితరులు ముఖ్యఅతిథులుగా ఈ వేడుకలో పాల్గొన్నారు.
బంజారా సంస్కతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ చిత్రంలో నటించడం గర్వంగా ఉందని సుమన్, భానుచందర్ అన్నారు. '64 దేశాల్లో ఉన్న 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హదయాలకు హత్తుకునేలా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈనెల 18న మా చిత్రాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశాం' అని నిర్మాతలు ఇస్లావత్ వినోద్రైనా, సీతారామ్ నాయర్ తెలిపారు.