Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎంఎస్ రాజు తాజాగా దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ '7 డేస్ 6 నైట్స్'. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. సినిమాపై కూడా ట్రైలర్ అంచనాలు పెంచింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నట్టు ఎంఎస్.రాజు తెలిపారు.
ఇందులో సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్ ఓ జంటగా, రోహన్, క్రితికా శెట్టి మరో జంటగా నటించారు. సుమంత్ అశ్విన్.ఎం, రజనీకాంత్.ఎస్ నిర్మాతలు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. నిర్మాతల్లో ఒకరైన సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, 'ఒక రోడ్ ట్రిప్‌కు వెళ్లిన ఇద్దరు యువకుల కథే ఈ సినిమా. ఇదొక కూల్ ఎంటర్టైనర్. వండర్ ఫుల్ విజువల్స్, రొమాన్స్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ హైలైట్ అవుతుంది. నా కెరీర్లో ఈ సినిమాలోని క్యారెక్టర్ బెస్ట్ క్యారెక్టర్‌గా నిలుస్తుంది' అని తెలిపారు. సహ నిర్మాత జె. శ్రీనివాసరాజు మాట్లాడుతూ, 'ఎంఎస్ రాజు గారి నుంచి వచ్చే మరో క్లాసిక్ ఇది. ఇదొక లైట్ హార్టెడ్ కామెడీ. యువతీ యువకులకు గిలిగింతలు పెట్టే చిత్రమిది' అని అన్నారు.