Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏపీ ముఖమంత్రిని కలవడానికి చిరంజీవి గారు ఒక్కరు వెళ్లినా, అందరితో కలిసి వెళ్లినా అది ఇండిస్టీ కోసమే' అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
పరిశ్రమలోని సమస్యల గురించి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ' ఆన్లైన్లోనే టికెట్లను అమ్మాలి. అయితే టికెట్లను ఎక్కువ రేటుకి అమ్ముకోవడాన్ని సమర్ధించకూడదు. కానీ ఎక్కువ షోలు వేసుకునే వెసులుబాటు మాత్రం కల్పించాలి. ఛాంబర్ ద్వారా డిజిటల్, క్యూబ్ వాళ్ళకి మనీ ఇస్తే చిన్న సినిమా వాళ్ళకి నష్టం ఉండదు. చిన్న సినిమాలకు కొన్ని వారాలు పాటు థియేటర్లను కేటాయించడంతోపాటు ఒక షో ఎక్కువ వేసుకునే అవకాశం ఇవ్వాలి. నంది అవార్డ్స్‌ని ఏపీ ప్రభుత్వం, సింహ అవార్డ్స్‌ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు. వాటిని త్వరలోనే ఇచ్చే ఏర్పాటు చేయాలి. సినిమాలకు సబ్సిడీలు ఇవ్వాలి. ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా ఫ్రీగా లొకేషన్లు షూటింగ్‌కి ఇవ్వాలి. అలాగే మినీ థియేటర్స్‌ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అని తెలిపారు.