Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ బాబు లేటెస్ట్గా నటిస్తున్న యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సర్కారు వారి పాట'. పరుశురామ్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం బుధవారం ఓ స్పెషల్ పోస్టర్ని విడుదల చేసింది. ఈ మ్యూజికల్ నెంబర్‌తో మీరూ ప్రేమ పడండి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
'ఇందులో నాయికగా నటిస్తున్న కీర్తి సురేష్ పాత్ర పేరు కళావతి. ఈ పాత్రని బేస్ చేసుకుని ఈ ఫస్ట్ సింగిల్ ఉండనుందని పోస్టర్లో ఉన్న రిలిక్ చెప్పకనే చెబుతోంది. ఇది కచ్చితంగా మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలుస్తుంది. తమన్ స్వరపరిచిన ఈ పాటతో అందరూ ప్రేమలో పడటం ఖాయం. ఈ పాటలో మహేష్ బాబు, కీర్తి సురేష్ మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఫిదా చేస్తుంది. మునుపెన్నడూ చూడనంత స్టైలిష్ మహేష్ బాబుని దర్శకుడు పరశురామ్ సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎఎంబి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర బృందం పేర్కొంది.