Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పాండమిక్ టైమ్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలే అవసరం. 'డిజె టిల్లు' అలాంటి చిత్రమే' అని అంటున్నారు యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి విమల్ కష్ణ దర్శకుడు.
ఈ నెల 12ననీ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ గురువారం మీడియాతో సంభాషించారు.
ఆ విశేషాలు..
'కష్ణ అండ్ హిస్ లీల' సినిమా చూశాక సిద్ధుని పిలిచి ఏదైన కథ చెప్పమంటే, లవ్‌స్టోరీకి క్రైమ్ యాంగిల్ కలిపి యూత్‌ఫుల్ కథను చెప్పాడు. మేము కథ ఓకే అనుకున్నాక త్రివిక్రమ్ గారికి చెప్పాం. ఆయన కథకు చేయాల్సిన మార్పులు, సలహాలు తెలిపారు. దీంతో ఫైనల్ వెర్షన్ హిలేరియస్‌గా వచ్చింది. ఇది యూత్ ఫుల్ సినిమా. కానీ అడల్డ్ చిత్రం కాదు. అమ్మాయి కోణంలో సాగే చిత్రమిది. టిల్లు ఒక అమాయక పాత్ర మాత్రమే. అతన్ని హీరోయిన్ ఆడుకుంటుంది. దానిలో నుంచే వినోదం పుడుతుంది.
పాటలు మంచి విజయం సాధించటం ఈ చిత్రానికి చాలా ప్లస్ అయింది. రామ్ మిరియాల కంపోజ్ చేసి పాడిన 'డిజె టిల్లు' సాంగ్, అలాగే అనిరుద్ పాడిన 'పటాసు పిల్ల..' పాట, సిద్దు పాడిన మరో పాట ఇలా అన్నీ దేనికవే బాగా అలరించాయి. శ్రీచరణ్ పాకాల, రామ్ మిర్యాల కంపోజ్ చేసిన పాటలు, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మెయిన్ హైలెట్.
సిద్ధు మల్టీటాలెంటెడ్. అతని రైటింగ్ స్టైల్ ట్రైలర్లో చూసే ఉంటారు. కావాల్సినంత రాసి, అంతే బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు. సినిమా మొత్తం టిల్లు మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాడు. మంచి ఫన్ ఫిల్మ్ చూశామనే సంతప్తి కచ్చితంగా కలుగుతుంది. దీనికి సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. సీక్వెల్ ఉంటుందనే సందర్భంలోనే ఈ సినిమాని ఎండ్ చేశాం.
మా సంస్థలో యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి కారణం వాళ్లు సినిమాలను కొత్తగా ప్రెజెంట్ చేస్తారని నమ్మడమే. ఇందులో భాగంగా చేస్తున్నవే 'స్వాతిముత్యం', 'అనగనగా ఒక రాజు' సినిమాలు. మన సినీ పెద్దలు ఏపీ ముఖ్యమంత్రిని కలిసి, ఆయనతో జరిపిన చర్చలు సఫలమై, పరిస్థితులన్ని సహకరిస్తే ఈ నెల 25నే పవర్‌స్టార్ 'భీమ్లా నాయక్'ను విడుదల చేస్తాం. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి తగ్గట్టే సినిమా ఉంటుంది.