Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'ముఖచిత్రం'. 'కలర్ ఫొటో' ఫేమ్ సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఎస్కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ ఎల్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గంగాధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన ఓ వేడుకలో హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'టీజర్ చాలా బాగుంది. టెక్నికల్‌గా ఆకట్టుకునేలా ఉంది' అని తెలిపారు. 'ప్రొడక్షన్లో మాకు అనుభవం లేదు. దాంతో టీమ్‌ను కొంత ఇబ్బంది పెట్టాం. అయితే అందరూ అర్థం చేసుకుని సినిమా కంప్లీట్ చేశారు' అని నిర్మాత ప్రదీప్ చెప్పారు. హీరో వికాస్ వశిష్ట మాట్లాడుతూ, ''సినిమా బండి' విడుదలయ్యాక ఈ ఆఫర్ వచ్చింది. సందీప్ కథ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా ఉందనిపించింది. సినిమా అంతకంటే బాగా రూపొందించారు. టెక్నికల్‌గా సినిమా అద్భుతంగా వచ్చింది' అని అన్నారు.
'టీజర్లో మీరు చూసింది కొంతే. ఇంతకు వంద రెట్లు సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది' అని దర్శకుడు గంగాధర్ తెలిపారు.
ప్రెజెంటర్ ఎస్కేఎన్ మాట్లాడుతూ, 'ప్రస్తుత సమాజంలోని ఓ బలమైన అంశాన్ని ఎంచుకుని సందీప్ రాజ్ ఈ కథ రాశాడు. రెండు షేడ్స్‌లో ప్రియ వడ్లమాని అద్భుతంగా నటించింది. దర్శకుడు గంగాధర్ చాలా చక్కగా తెరకెక్కించాడు. ఓ మంచి సినిమా చేశామని గర్వంగా చెప్పగలం' అని అన్నారు.