Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'డిజె టిల్లు' ప్రీ రిలీజ్ వేడుకలో సిద్ధు జొన్నలగడ్డ
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'డిజె టిలు'్ల. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. నూతన దర్శకుడు విమల్ కష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. నేడు (శనివారం) ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రామానాయుడు స్టూడియోలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఆద్యంతం వినోదాత్మకంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో బ్యూటిఫుల్ మ్యూజిక్ కుదిరింది. పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుంది' అని తెలిపారు.
'మా సినిమా ట్రైలర్ ఇప్పటికే సూపర్ హిట్. సిద్ధును స్క్రీన్ మీద చూస్తేనే నవ్వొస్తుంది. వంశీగారి బ్యానర్లో ఇది మరొక హిట్ అవుతుంది. ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది' అని నాయిక సిమ్రాన్ చౌదరి అన్నారు.
ప్రిన్స్ మాట్లాడుతూ, 'బయట మమ్మల్ని నవ్వించే సిద్ధు ఇప్పుడు డిజె టిల్లుగా మీకు ఫన్ ఇవ్వబోతున్నాడు. సిద్దు సక్సెస్ చూస్తే సంతోషంగా ఉంది. సినిమాని డబ్బింగ్ వర్షెన్‌లో చూస్తూనే చాలా నవ్వుకున్నాం. ఈ సినిమా ఫలితంపై మా అందరికీ మంచి నమ్మకం ఉంది' అని చెప్పారు.
'పాటకు సగం బలం సాహిత్యమే. మంచి పదాలు పడితే ఆ పాట మంచి హిట్ అవుతుంది. కాసర్ల శ్యామ్ అలాంటి పాటే ఇచ్చారు. సిద్దుకి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఇందులో సాంగ్స్ హిట్ అవడానికి దర్శకుడు విమల్‌కు ఉన్న స్పష్టత కూడా కారణం' అని సింగర్ రామ్ మిర్యాల తెలిపారు. దర్శకుడు విమల్ కష్ణ మాట్లాడుతూ, 'డిజె టిల్లు ఎలా ఉంటాడో నిజాయితీగా స్క్రీన్‌పై చూపించాలనుకున్నాం. ట్రైలర్‌తో సగం సక్సెస్ అందుకున్నాం. మిగతాది థియేటర్లో వస్తుందని ఆశిస్తున్నాం. కొత్త దర్శకుడినైనా నన్ను నమ్మి నిర్మాత వంశీ గారు సినిమా ఇచ్చారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఒక లిఫ్ట్ ఇచ్చారు' అని అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, 'ఈ సినిమా గురించి మాట్లాడాల్సింది అంతా ట్రైలర్ రిలీజ్ అప్పుడే మాట్లాడాను. కంప్లీట్ ఫన్ ఫిల్మ్ ఇది. థియేటర్లో చూసి ఎంజారు చేయండి' అని చెప్పారు.
'ఈ సినిమాతో నేను ఇప్పటిదాకా వినని పదాలు వింటున్నాను. టికెట్ బుకింగ్స్, బ్రేక్ ఈవెన్, థియేట్రికల్ రైట్స్ అమ్మకం, ఓవర్సీస్లో బుకింగ్స్..ఇవన్నీ నాకు కొత్తగా ఉన్నాయి. మీరు థియేటర్‌కి వస్తే మేం మిమ్మల్ని నవ్విస్తాం. అందరూ ఎంజారు చేసే సినిమా ఇది' అని హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు.