Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా 'గని'. అల్లు బాబీ కంపెనీ, రియనైన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ లభించిన ఈచిత్రంలో సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈనెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
'ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన 'రోమియో జూలియట్..' పాటకు కూడా మంచి స్పందన వస్తోంది. లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాట పాడారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా ఎట్రాక్ట్ చేసింది. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఈనెల 25న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి దర్శకుడు: కిరణ్ కొర్రపాటి, నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, సంగీతం: తమన్.