Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పిట్టీ ఇంజనీరింగ్ లిమిటెడ్ 2021-22 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(క్యూ3)లో 58.68 శాతం వృద్థితో రూ.11.52 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.7.26 కోట్ల లాభాలు నమోదు చేసినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో రూ.151.32 కోట్లుగా ఉన్న రెవెన్యూ క్రితం క్యూ3లో 75.01 శాతం పెరిగి రూ.264.83 కోట్లకు చేరింది. ప్రతీ రూ.5 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై మూడో మధ్యంతర డివిడెండ్ కింద 40 పైసలు అందించడానికి బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారని ఆ కంపెనీ ఎండి, వైస్ ఛైర్మన్ అక్షరు ఎస్ పిట్టి తెలిపారు. తొలి మూడు త్రైమాసికాల్లో మంచి ప్రగతిని కనబర్చామన్నారు.