Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజరు ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'నల్లమల'. రవి చరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్.ఎమ్ నిర్మించారు. శనివారం నిర్వహిం చిన వేడుకలో ఈ చిత్ర ట్రైలర్‌ను నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా పాల్గొని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ''నల్లమల' అని చెప్పగానే.. ఏమున్నవే పిల్లా అనే సాంగ్ గుర్తొచ్చింది. ఈ సాంగ్ అంత పెద్ద హిట్ అయిందంటే సినిమాలో, దర్శకుడిలో ఏదో ఉందని అర్థమైంది. కొత్త వాళ్లంతా కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి' అని చెప్పారు. 'నిర్మాత దూరంగా ఉన్నా కూడా నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. పాట విడుదలైన రోజు నుంచి ప్రతీ ఒక్కరూ మెచ్చుకున్నారు. మొదటగా త్రివిక్రమ్ గారి దగ్గరికి మా హీరో తీసుకెళ్లారు. పాట బాగుంది.. సినిమా బాగా తీయండని అన్నారు. ఆ తరువాత నాజర్, దేవాకట్టా, రాఘవేంద్రరావు గారు ప్రశంసించారు' అని దర్శకుడు రవి చరణ్ అన్నారు. అమిత్ తివారి మాట్లాడుతూ, 'నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. మూడేళ్లు కష్టపడ్డాం. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాకు హీరో కథే.ఇంత మంచి కథను రాసి, నాకు హీరోగా కారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ రవి చరణ్ గారికి థ్యాంక్స్' అని తెలిపారు.