Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పన్నా రాయల్ దర్శకత్వంలో రూపొందిన మరో డిఫరెంట్ మూవీ 'ఇంటి నెం.13'. ఈ చిత్రాన్ని రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై హేసన్ పాషా నిర్మిస్తున్నారు. లేటెస్ట్గా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా నటుడు ఆనంద్ రాజ్ మాట్లాడుతూ, 'చాలా కాలం తర్వాత మళ్లీ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. చాలా మంచి సినిమా చేసానన్న సంతప్తి ఈ సినిమా నాకు ఇచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది' అని అన్నారు. 'ట్రైలర్ చాలా బాగుంది. అందరూ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ అంటున్నారు. ఇది ఏ భాషకైనా, ఏ ప్రాంతానికైనా సూట్ అయ్యే సినిమా కాబట్టి నేను దీన్ని గ్లోబల్ మూవీ అంటున్నాను' అని రాజ్ కందుకూరి చెెప్పారు. నిర్మాత హేసన్ పాషా మాట్లాడుతూ, 'ఈ సినిమా విషయంలో డైరెక్టర్ పన్నాకి పూర్తి స్వేచ్చనిచ్చాను. సినిమా చాలా బాగా వచ్చింది' అని తెలిపారు. 'ట్రైలర్ చూసి అందరూ బాగుందని చెప్తున్నారు. సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి నిర్మాత హేసన్ పాషాగారు ఇచ్చిన ఫ్రీడమే కారణం. విజువల్‌గా హాలీవుడ్ మూవీలా ఉంటుంది, కంటెంట్ పరంగా చూస్తే ఇది పూర్తిగా ఇండియన్ సినిమాలా ఉంటుంది. టెక్నికల్‌గా చాలా హై రేంజ్లో ఉంటుంది' అని డైరెక్టర్ పన్నా రాయల్ చెప్పారు.