Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రేమ ఎంత మధురం అని తెలియజేసే ఈ ప్రేమికుల వారాన్ని రియల్ లైఫ్ కపుల్‌తో కలర్ఫుల్గా జీ తెలుగు సెలబ్రేషన్ చేసింది. ప్రేక్షకుల విశేష ఆదరణతో జీ తెలుగులో 'ప్రేమ ఎంత మధురం' టైటిల్ సాంగ్, సీరియల్ దిగ్వి జయంగా రెండేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలుగు టెలివిజన్ చరిత్రలోనే మొదటి సారి ఈ సీరియల్ టైైటిల్ సాంగ్‌ని రియల్ లైఫ్ కపుల్స్‌పై చిత్రీకరించారు. ఆర్యవర్ధన్ (వెంకట్ శ్రీరామ్), అను (వర్ష) ఎనౌన్స్ చేసిన కాంటెస్ట్‌లో మూడు జంటలను (భవ్య శ్రీ - రాహుల్, దీప్తి - మహేష్, ప్రదీశా - సందీప్) సెలెక్ట్ చేశారు. ఈ సీరియల్ టైటిల్ సాంగ్‌ని ఈసారి కూడా అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించారు. ఈ మూడు జంటలు అను, ఆర్యతో టైటిల్ సాంగ్, చిత్రీకరణలో పాల్గొన్నారు. ఒక్కొక్క జంటది ఒక్కో మధురమైన కథ. ఆ జంటల ఊసులను ప్రేక్షకులకు పంచేందుకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా జీ తెలుగు అన్ని ఏర్పాటు చేసింది.