Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన 'భామా కలాపం' ఇటీవల ఆహాలో విడుదలైంది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో నాయిక ప్రియమణి శనివారం మీడియాతో మాట్లాడుతూ, 'ఈ సినిమా చూసుకున్నాక నాకు 100కి 200 శాతం సంతృప్తినిచ్చింది. ఇప్పటి వరకు చూసిన వారందరూ చాలా బావుందని మెసేజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పాజిటివ్ రిప్లై ఇస్తున్నారు. నాకు కథ వినగానే నచ్చింది. దర్శకుడు స్టోరీ చెప్పిన విధానం చాలా బాగా ఉంది. గుడ్డు మీద సినిమా అంతా తిరుగుతుందని దర్శకుడు చెప్పగానే చాలా ఆసక్తిగా అనిపించింది. నేను ఇంతకు ముందు ఎప్పుడూ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్‌గా నటించలేదు. అందుకే కొత్తగా అనిపించి చేశాను. అయితే ఇందులో అనుపమగా నేను నటించిన పాత్ర నా హార్ట్‌కి క్లోజ్‌గా ఉంటే క్యారెక్టర్ కాదు. ఎందుకంటే నిజ జీవితంలో నేను అలా ఉండను. 'విరాటపర్వం', హిందీలో 'మైౖదాన్' కన్నడలో 'డాక్టర్ 56', తమిళంలో 'కొటేషన్ గ్యాంగ్' వీటితోపాటు 'ఫ్యామిలీమేన్3' వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాను' అని అన్నారు.