Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామాజిక, కుటుంబ కథా నేపథ్యంలో వ్యక్తుల నైజం, వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు, వ్యవహారిక శైలి వంటి అనేక కోణాలతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'నైజం'. ట్రూత్ అఫ్ లైఫ్ అనేది క్యాప్షన్.
భార్గవి శ్రీ డైమెన్షన్ ఫిలిం పతాకంపై సంజరు, రవి కిరణ్, సార నటీ నటులుగా కోన రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కాండ్రేగుల చందు, ఆంజనేయ ఎన్నంశెట్టి, లగుడు లోవ సత్యనారాయణ (బుజ్జి) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు శనివారం అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరిగాయి.
శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ డాక్టర్ కత్తి మండ ప్రతాప్ హీరో, హీరోయిన్ల పై తొలి షాట్‌కు క్లాప్ కొట్టి, కెమెరా స్విచ్చాన్ చేయగా, చిత్ర దర్శకుడు కోనరమేష్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ,'ఒక మనిషి యాట్యిట్యూడ్ ఏంటి?, ఎప్పుడు ఎలా ప్రభావితం అవుతారు వంటి అనేక అంశాలను ఇందులో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి, ఉగాదికి ట్రైలర్ కూడా విడుదల చేస్తాం' అని చెప్పారు. 'హైదరాబాద్, మారేడు మిల్లి తదితర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం' అని దర్శకుడు కోన రమేష్ తెలిపారు.