Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అజయ్ కతుర్వార్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'విశ్వక్'. గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తాటికొండ ఆనందం బాలకష్ణ నిర్మిస్తున్నారు. వేణు ముల్కాకా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రసాద్‌ల్యాబ్‌లో ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత తాటికొండ ఆనందం బాలకష్ణ మాట్లాడుతూ,'మన భారతదేశంలో యూత్ యు.ఎస్.కు వెళ్లిపోతున్నారు. మిమ్మల్ని కాదురా వెళ్ళమంది. బ్రిటీష్‌వారిని వెళ్ళమంది.. అనే పాయింట్‌తో రూపొందిన సినిమా ఇది. విశ్వక్ తన పాత్రలో ఒదిగిపోయాడు. 18న మీరు థియేటర్లలో మా సినిమాని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం' అని చెప్పారు. 'మన ఇండియాలోని మేధావులు వలసలు వెళ్తుంటే దేశం ఎలా అభివద్ధి చెందుతుంది అనే కోణంలోనే ఈ సినిమా ఉంటుంది' అని దర్శకుడు వేణు ముల్కాకా అన్నారు. హీరో అజరు కతుర్వార్ మాట్లాడుతూ, 'ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా నా కెరీర్లో బెస్ట్ సినిమాగా నిలుస్తుంది' అని తెలిపారు. సంగీత దర్శకుడు సత్య సాగర్ పొలం మాట్లాడుతూ, 'కథకు సరిపోయే బాణీలు కుదిరాయి. గీత రచయితలు బాగా రాశారు' అని చెప్పారు.