Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్ హీరోగా నటించిన తాజా సినిమా 'మళ్ళీ మొదలైంది'. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను 'జీ 5' ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా ఈ నెల 11న రిలీజ్ చేసింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, 'తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఈ సినిమాను నిన్న చాలామంది స్నేహితులు యు.ఎస్., బెంగుళూరు, చెన్నైలలో చూశారు. బాగా డీల్ చేశారంటూ అభినందలు తెలిపారు. అలాగే ఈ సినిమాను సుమంత్ ఫ్యామిలీతో పాటు ఆయన స్నేహితులు కూడా చూసి బాగుందని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. కొన్నిచోట్ల క్రిటిక్స్ తమశైలిలో స్పందిస్తున్నారు. ఇది విడాకులు తీసుకున్న జంట కథే అయినా వారి జీవితం ఎలా మళ్ళీ మొదలైంది అనేది సినిమా సారాంశం. చాలా సున్నితమైన అంశాన్ని తీసుకుని ఎంటర్టైన్మెంట్లో చూపించాం.
ఈ విడాకుల కథకు స్పూర్తి నా స్నేహితుడు. అతని జీవితంలో విడాకులు, మళ్ళీ పెళ్లి సంఘటనలు జరిగాయి. ఈ సినిమాలో చూపించిన లాయర్ పాత్రల్లాంటివి సినిమాటిక్‌గా పెట్టాం. అయితే స్క్రిప్ట్ రాసే క్రమంలో విడాకులు తీసుకున్న కొన్ని జంటలను కలిసి వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. అప్పుడు దీన్ని సీరియస్‌గా వద్దు. కామెడీ టచ్‌తో చేయమని వాళ్ళు సలహా ఇచ్చారు. ఇందులో ఎటువంటి వల్గారిటీ లేదు. హాయిగా కుటుంబంతో చూసే సినిమా. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుని చేశాం. ఈ సినిమాను థియేటర్ కోసమే చేశాం. కానీ కరోనా వల్ల థియేటర్ల ఇబ్బంది కావడంతో ఓటీటీ సేఫ్ అని నిర్మాతలు భావించారు. అలాగే జీ5 వారికి నచ్చి, మంచి ఆఫర్ ఇచ్చారు' అని అన్నారు.