Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'డిజె టిల్లు'. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాలలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తమ విజయానందాన్ని చిత్ర నిర్మాత, హీరో, దర్శకుడు మీడియాతో షేర్ చేసుకున్నారు.
హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ,'.నేను ఇప్పటిదాకా నా కెరీర్లో బ్లాక్ బస్టర్ అనే మాట వినలేదు. ఇప్పుడు ఈ సినిమాతో వింటున్నందుకు హ్యాపీగా ఉంది' అని అన్నారు. 'ఈ కథ విన్నప్పుడే ఈ రకమైన స్పందన ప్రేక్షకుల నుంచి వస్తుందని ఊహించాం. ఇవాళ మా అంచనా నిజమైంది. పెద్ద విజయాన్ని అందించారు. ఇలాంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్నప్పుడే రిస్క్ చేయాలనే ధైర్యం కలుగుతుంది. ఇంకా కొత్త వాళ్లను ప్రోత్సహించాలనే ఇంట్రెస్ట్ వస్తుంది' అని నిర్మాత నాగవంశీ చెప్పారు. దర్శకుడు విమల్ కష్ణ మాట్లాడుతూ, 'థియేటర్లలో ప్రేక్షకుల సందడి చూసి నమ్మలేకపోయాం' అని తెలిపారు.