Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీజ ఆర్ట్స్, బాచిన వైష్ణవ్ చౌదరి ఫిల్మ్స్ పతాకాలపై అమీర్, ప్రణీత, దీపిక జంటగా రూపొందుతున్న చిత్రం 'ఇట్లు'. పూదారి రాజా గౌడ్, పూదరి రాజశేఖర్ గౌడ్, బాచిన నాగేశ్వరరావు నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో పందిళ్లపల్లి రోషి రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను మంత్రి హరిష్ రావు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'అందరూ కొత్తవారైనప్పటికీ ఎంతో ధైర్యంతో ఈ చిత్రాన్ని పూర్తి చేసి, విడుదలకు రెడీ చేయటం అభినందనీయం. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
'మాది చిన్న చిత్రమైనప్పటికీ పెద్ద మనసుతో మా పోస్టర్ లాంచ్ చేసిన హరీష్ రావు గారికి కతజ్ఞతలు' అని నిర్మాతలు చెప్పారు. దర్శకుడు రోషి రెడ్డి మాట్లాడుతూ,'ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, విజన్ స్టూడియోలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నాం. అతి త్వరలోనే దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని తెలిపారు. 'మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా మా సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కావడం మా అదష్టం. ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అని హీరో, హీరోయిన్లు అన్నారు.
సుమన్ అతిథి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మహాలక్ష్మి, జి.వి. నారాయణరావు, జబర్దస్త్ యాక్టర్స్ జీవన్, రాజమౌళి, కొమురం, బాబి, శిరీష ఇతర పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాచిన నాగేశ్వరరావు, కెమెరా మెన్: రామరాజు-నిమ్మ గోపి, సంగీతం: శివ-ప్రణరు, కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి, ఫైట్స్: పి సతీష్, నిర్మాతలు: పూదారి రాజా గౌడ్, పూదరి రాజశేఖర్ గౌడ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: పందిళ్లపల్లి రోషి రెడ్డి.