Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ నిర్మించనున్నారు. ఈ సినిమా శనివారం కూకట్పల్లిలోని భవ్యాస్ సముదాయంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ, 'హీరోగా పదేళ్ళు పూర్తి చేసుకున్న సుధీర్ బాబుకు కంగ్రాట్స్. ఆయనతో మా సంస్థలో 'శమంతకమణి' చేశాం. ఇప్పుడు మరో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. ఇదొక హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. కథ వినగానే సుధీర్ బాబుకు నచ్చేసింది. వెంటనే ఓకే చేశారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన కనిపిస్తారు. ఇందులో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం' అని చెప్పారు. 'పోలీస్ డిపార్ట్మెంట్ నేపథ్యంలో ఒక డిఫరెంట్ స్టొరీతో చేస్తున్న సినిమా ఇది' అని శ్రీకాంత్ తెలిపారు.
సుధీర్ బాబు మాట్లాడుతూ, 'నేను యాక్షన్ సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీలవుతారని అనుకుంటున్నాను' అని అన్నారు. 'తెలుగులో 'ప్రేమిస్తే' సినిమాను అందరూ చూశారు. ఆ తర్వాత నా తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. ఇది నా స్ట్రయిట్ తెలుగు సినిమా. నటుడిగా పరిచయమైన 19 ఏళ్ళ తర్వాత తెలుగుకు వస్తున్నాను. ఈ సినిమా నాకు చాలా స్పెషల్' అని భరత్ తెలిపారు. దర్శకుడు మహేష్ మాట్లాడుతూ, 'ఇదొక ఇన్నోవేటివ్ యాక్షన్ థ్రిల్లర్. ఎక్ట్స్రాడినరీ స్టంట్స్ ఉంటాయి' అని అన్నారు. 'మంచి స్క్రిప్ట్, మంచి నిర్మాణ సంస్థలో చేస్తున్న చిత్రమిది. చాలా సంతోషంగా ఉంది' అని సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ చెప్పారు.