Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకురాలు నందినిరెడ్డి ఫస్ట్‌షాట్‌కి దర్శకత్వం వహించగా, మంచు మనోజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. మంచు అవరామ్, మంచు విద్యా నిర్వాణ స్క్రిఫ్ట్ అందజేసారు. మోహన్ బాబు, ఆయన తనయ మంచు లక్ష్మీప్రసన్న ఈ చిత్రంలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మళయాళ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సిద్దిక్ కీలక పాత్ర పోషించబోతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నారు. డైమండ్ రత్నబాబు స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి కెమెరామెన్ సాయిప్రకాష్, మ్యూజిక్ ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం.
ఈ చిత్రం గురించి దర్శకుడు ప్రతీక్ ప్రజోష్ మాట్లాడుతూ, 'ఇదొక స్టన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్. మోహన్‌బాబు, మంచు లక్ష్మి మునుపెన్నడూ కనిపించని పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం' అని తెలిపారు.
'మా సొంత బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. డైమండ్ రత్నబాబు చెప్పిన కథ అద్భుతంగా ఉంది. దర్శకుడు చెప్పినట్టు నిజంగానే ఇదొక స్టన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఎవ్వరూ గెస్ చేయలేరు. తొలిసారి నా బిడ్డ లక్ష్మీ ప్రసన్నతో స్క్రీన్ మీద కనిపించనుండటం ఆనందంగా ఉంది. ఈ కథలో మేమిద్దరం ఏం చేస్తాం?, మా పాత్రలు ఎలా ఉంటాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈనెల 18న నేను నటించిన 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ఫలితంపై మంచి నమ్మకంతో ఉన్నాం' అని తెలిపారు.