Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్య నటించిన 'ఇటి' సినిమా తెలుగు హక్కులను ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కైవసం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన 'ఆకాశం నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందిన అగ్ర కథానాయకుడు సూర్య. ఆయన తాజాగా పాండిరాజ్ దర్శకత్వంలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ఇటి' (ఎతర్క్కుం తునిందావన్). సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు.
టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకుంది. సూర్యకు ఉన్న భారీ మార్కెట్ రేంజ్‌ను దష్టిలో ఉంచుకుని, తెలుగులో 'ఇటి' పేరుతో ఈ సినిమా హక్కులను ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నారు.
తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10న ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సినిమాస్ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా కోసం సూర్య తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. దీంతో డబ్బింగ్ స్టూడియోలో ఉన్న సూర్య ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రియాంక అరుల్ మోహన్, వినరురారు, సత్యరాజ్, రాజ్‌కిరణ్, శరణ్య పొన్వన్నన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్.రత్నవేలు, సంగీతం: డి.ఇమ్మాన్.