Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాకేష్, మహి, రవి, సిరి, రుచిత, వెన్నెల, రంగస్థలం లక్ష్మి ప్రధాన పాత్రధారులుగా సూర్యచక్ర పిక్చర్స్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో డి.మహేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం 'రొమాంటిక్ ఫ్రీ ఫైర్ లవ్ స్టోరీస్'.
సోమవారం ఫిలిం ఛాంబర్లో జరిగిన ప్రెస్ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత డి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ''దర్శకుడు నరసింహ నంది దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన అనంతరం మొదటి ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం చేశాను. పబ్జీ ఆన్లైన్ గేమ్ మాదిరిగానే ఫ్రీ ఫైర్ అనే ఆన్లైన్ గేమ్‌కు యువతరం ఎలా బానిస అవుతోంది?, చదువుకున్న నలుగురు గ్రామీణ యువకులపై ఆ గేమ్ ఎలాంటి ప్రభావం చూపింది?, దీంతో వారి కుటుంబాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే అంశాలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇందులోని నాలుగు పాటలూ చాలా బాగా వచ్చాయి. త్వరలోనే మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని చెప్పారు.