Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజరు ప్రధాన పాత్రల్లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '69 సంస్కార్ కాలనీ'. లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకంపై బి.బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 4న ఈ సినిమా విడుదల కానుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ను పాత్రికేయుల సమావేశంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరోయిన్ ఎస్తర్ మాట్లాడుతూ, 'ఇది స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమా. ప్రస్తుతం సొసైటీలో రిలేషన్ షిప్ అనేది ఎలా కాంప్లికేటెడ్ అయ్యిందనే కోణంలో ఈ సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది' అని తెలిపారు. 'మంచి కంటెంట్ ఉన్న సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు, స్వాతిగారికి ధన్యవాదాలు. నా క్యారెక్టర్ చాలా ఎమోషనల్గా ఉంటుంది' అని రిశ్వి తిమ్మరాజు చెప్పారు.
చిత్ర నిర్మాత బాపిరాజు మాట్లాడుతూ,'ప్రవీణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. శివరాం అద్భుతమైన కెమెరా పనితనాన్ని చూపారు. డీఐ చేసిన పురుషోత్తం సౌండ్ మిక్సింగ్ చేసిన విష్ణుకి ధన్యవాదాలు. గమన్ శ్రీ, యక్కలి రవీంద్ర బాబు మంచి పాటలు రాశారు. సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం' అని అన్నారు.
'కమర్షియల్ పాయింట్ అనే కాకుండా సామాజిక సారం ఉండాలనే ఉద్దేశంతో ఈ స్టోరీని డెవలప్ చేశాం. నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతి పాత్రలో డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి' అని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు.