Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాల్లో '2020 గోల్ మాల్', 'సురభి 70ఎంఎం' (హిట్టు బొమ్మ) ఉన్నాయి. జాన్ జిక్కి దర్శకత్వం వహించిన '2020 గోల్ మాల్' సినిమాలో మిట్టకంటి రామ్, విజరు శంకర్, అక్షితా సోనవానె, మహి మల్హోత్రా, కిస్లే చౌదరీ హీరో, హీరోయిన్లుగా నటించారు.
దర్శకుడు గంగాధర వైకే అద్వైత తెరకెక్కించిన 'సురభి 70ఎంఎం' చిత్రంలో అనిల్‌కుమార్, వినోద్ నాగులపాటి, ఉషాంజలి, అక్షిత, శ్లోక తదితరులు నటించారు. తెలుగునాట ఎన్నడూ లేని విధంగా, సరికొత్త ట్రెండ్‌కి నాంది పలుకుతూ ఈ రెండు చిత్రాల ప్రీ రిలీజ్ వేడుకని ఒకే వేదికపై మేకర్స్ ఘనంగా నిర్వహించారు. దర్శకులు వీఎన్ ఆదిత్య, చంద్ర మహేష్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా '2020 గోల్మాల్' దర్శకుడు జాన్ జిక్కి మాట్లాడుతూ, 'మా నిర్మాత సహకారం వల్లే రిలీజ్ వరకు రాగలిగాం. ఓ కొత్త తరహా అనుభూతిని కలిగించేలా చిత్రాన్ని రూపొందించాం' అని తెలిపారు.
'కథలను నమ్మి సినిమాలు చేసే నిర్మాత మాకు దొరకడం అదష్టం. విలేజ్‌లో సాగే మంచి ఎంటర్టైనర్గా మా సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది' అని 'సురభి 70 ఎంఎం దర్శకుడు గంగాధర వైకే అద్వైత చెప్పారు. 'ఈనెల 18న విడుదలయ్యే ఈ రెండు చిత్రాలూ మంచి విజయం సాధించాలి' అని ఈ వేడుకకు విచ్చేసిన అతిథులందరూ ఆకాంక్షించారు.