Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశేష ప్రేక్షకాదరణతో బ్లాక్బాస్టర్ సాధించిన 'పుష్ప' సినిమాలో నెగెటివ్ రోల్ చేసిన ధనుంజరుకి నటుడిగా మరింత మంచి గుర్తింపు లభించింది. కన్నడలో 8 సినిమాల్లో హీరోగా చేసిన ఆయన 9వ సినిమాగా శివరాజ్ కుమార్ చిత్రంలో ప్రతి నాయకుడిగానూ నటించి ప్రేక్షకుల్ని అలరించారు. అంతేకాదు ఈ చిత్రంలో పోషించిన డాలీ పాత్రతో 'డాలీ' ధనుంజరుగా పాపులరయ్యారు.
ఆయన తాజాగా నటించిన సినిమా 'బడవ రాస్కెల్'. శ్రీమతి గీతా శివరాజ్‌కుమార్ సమర్పణలో శంకర్ గురు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడలో ఈ సినిమా విడుదలై విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాని తెలుగులో అదే టైటిల్‌తో అనువదించి, ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఈ నేపథ్యంలో డాలీ ధనుంజరు మీడియా మాట్లాడుతూ, 'ఎక్కడికి వెళ్ళినా నన్ను చూడగానే 'తగ్గేదేలే' అంటూ పలుకరిస్తున్నారు. కన్నడలో 'పుష్ప' విడుదలైన వారం తర్వాత 'బడవ రాస్కెల్' రిలీజై హిట్ కొట్టింది. బడవ రాస్కెల్ అనేది స్వీట్‌గా తిట్టే తిట్టు. లెజెండరీ యాక్టర్ డా.రాజ్‌కుమార్ ఎక్కువగా వాడే పదం ఇది. ఈ సినిమాకి తెలుగు డైలాగ్స్ రామకష్ణ రాశారు. తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాను. అలాగే నా నిర్మాణంలో ఇది తొలిసినిమా. చదువు ముగిశాక ఉద్యోగ ప్రయత్నాలు చేసే వయసులో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇది మధ్యతరగతి కథ. ఇలాంటి కథలో తల్లిదండ్రులే హీరోలు. తెలుగులోనూ పెద్ద హిట్ అవుతుంది. పాత్ర నచ్చితే హీరో, విలన్ అని చూడకుండా నటిస్తా. నాకు రెండూ ఇష్టమే' అని చెప్పారు.