Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు శ్రీనాథ్ పులకురం రూపొందించిన చిత్రం 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందీ చిత్రం. ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టిన మేకర్స్ ప్రేమికుల రోజు కానుకగా సోమవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ, 'గతంలో రిలీజ్ చేసిన టైటిల్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ ఇచ్చిన ఉత్సాహంతో వాలెంటైన్స్ డే కానుకగా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశాం. మా తాతగారు కొవ్వూరి దానరెడ్డి (శ్రీ వెంకటరమణ ఆర్ట్స్ అసోసియేషన్, కొంకుదురు) నాటక రంగ దర్శకులు, నటులు నాకు స్ఫూర్తి. ఆయన స్ఫూర్తితో వాస్తవ కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. సినిమా చాలా వచ్చింది. మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమాలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : శరవణ వాసుదేవన్ సంగీతం డి.ఒ.పి : నిఖిల్ సురేంద్రన్, కథ, దర్శకత్వం: శ్రీనాథ్ పులకురం.