Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్రినాథ్ వర్మ, భావన సాగి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సోల్స్'. ఈ చిత్ర టీజర్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా దర్శకుడు వెంకటేష్ మహా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'టీజర్ చూస్తుంటే సినిమా మ్యూజికల్ లవ్ స్టొరీలా చాలా బాగుంది. ప్రధాన పాత్రలు పోషించిన త్రినాథ్ వర్మ, భావన సాగి చాలా బాగా నటించారు.ఈ సినిమా మంచి విజయం సాధించాలి' అని చెప్పారు.
'మనకు ఎదురయ్యే ఏ పరిచయం కూడా యాదచ్ఛికం కాదనే కథా నేపథ్యంలో రెండు సోల్స్ మధ్య జరిగే ప్రయాణమే ఈ సినిమా. సిక్కింలోని అరుదైన అందమైన ప్రదేశాల్లో షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా నిర్వహిస్తున్నారు. పరమకష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ బ్యానర్ పై విజయలక్ష్మి వేలూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు శ్రావణ్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ప్రతిక్ అబ్యంకర్, ఆనంద్ నంబియార్ సంయుక్తంగా సంగీతం అందించారు. శశాంక్ శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసారు. రవితేజ మహదాస్యం, మౌమిక రెడ్డి తదితరులు ముఖ్యపాత్రల్ని పోషించారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.