Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'డియర్ మేఘ' లాంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత నాయిక మేఘా ఆకాష్ మరో మంచి లవ్స్టొరీకి సైన్ చేసింది. 'డియర్ మేఘ' దర్శకుడు సుశాంత్ రెడ్డి ఈ చిత్రానికి కథ అందిస్తూ, నిర్మాణంలో కూడా భాగస్వామిగా ఉండబోతున్నారు. మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పణలో ఈ సినిమా నిర్మితం కానుండటం అందరికీ ఓ సర్ప్రైజ్. సుశాంత్ రెడ్డి.ఏ, అభిషేక్ కోట నిర్మాణంలో కోటా ఫిలిం ఫ్యాక్టరీ, ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందబోయే ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి అసోసియేట్ అభిమన్యు బడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'డియర్ మేఘ' వంటి హిట్ సినిమా తర్వాత మేఘ ఆకాష్తో చేస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. దర్శకుడు అభిమన్యు పై మాకు చాలా నమ్మకముంది. షూటింగ్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేస్తాం' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, ఎడిటర్: ప్రవీణ్ పూడి.