Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిషోర్ తిరుమల దర్శకుడు. రష్మిక మందన్న హీరోయిన్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 25న విడుదలకానుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు కిషోర్ తిరుమల మట్లాడుతూ, 'శర్వా గారు ఈ సినిమా ఫ్లేవర్‌ని ఎక్కడా మిస్‌కాకుండా పూర్తి సహకారం అందించారు. రష్మిక, కుష్బు, రాధికగారి పాత్రలు ఈ సినిమాకి హైలెట్. అందరూ హ్యాపీగా ఎంజారు చేస్తారు. ఫ్యామీలీ అంతా కలిసి చూసే చిత్రమిది. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది' అని తెలిపారు.
'ఈ సినిమా చూసి వెళ్లేటప్పుడు ఒక మంచి చిరునవ్వుతో, ఒక మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్‌తో ఇంటికి వెళ్తారు. రాధిక, కుష్బుగారి లాంటి యాక్టర్స్‌తో కలిసి నటించడం గర్వంగా ఫీలవుతున్నాను. రష్మికతో నటించడం చాలా సరదాగా ఉంటుంది. ఇంతమంచి అవకాశం ఇచ్చిన నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి థ్యాంక్స్. దర్శకుడు కిశోర్ తిరుమల ఇలాంటి ఒక బలమైన కథకి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' లాంటి టైటిల్ పెట్టడం నిజంగా ప్రశంసనీయం' అని హీరో శర్వానంద్ చెప్పారు. నాయిక రష్మిక మందన్న మట్లాడుతూ, 'కిషోర్ గారు ఈ స్క్రిప్ట్ నెరేట్ చేస్తున్నప్పుడే చాలా నవ్వుకున్నాను. సినిమా షూటింగ్‌లోనూ నవ్వుతూనే ఉన్నాం. డబ్బింగ్ టైమ్‌లో కూడా నవ్వుతూనే ఉన్నాం..సినిమా అంతా ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది' అని అన్నారు. రాధిక శరత్‌కుమార్ మాట్లాడుతూ, 'నేను తెలుగులో 250కి పైగా మూవీస్‌లో నటించాను. వాటిల్లో ఈ సినిమాకి చాలా ప్రత్యేక స్థానం ఉంది' అని తెలిపారు. 'కుంటుంబ విలువలు, బంధాల నేపథ్యంలో అద్భుతంగా తెరకెక్కింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి తప్పకుండా నచ్చుతుంది' అని కుష్బు అన్నారు.