Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'వర్జిన్ స్టోరీ'. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ బి అట్లూరి దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 18న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ, 'యువత కోణంలో సాగే చిత్రమిది. వాళ్ల ఆలోచనలకు ప్రతిబింబంలా ఉంటుంది. ఈ నెల18న థియేటర్లలో మా చిత్రాన్ని చూసి ఎంజారు చేయండి' అని తెలిపారు. 'నేటి యువతరం సినిమా ఇది. వాళ్ల ధైర్యం, భావోద్వేగాలను చూపిస్తున్నాం. ఈ సినిమాతో మా అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం గర్వంగా ఉంది' అని నిర్మాత లగడపాటి శిరీష చెప్పారు. దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి మాట్లాడుతూ, 'నేటి యువతకు అన్నీ వేగంగా జరగాలి. ఫుడ్ దగ్గర్నుంచి ఇష్టమైన వ్యక్తులను పొందడంలో కూడా అదే వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమకు, కోరుకున్న కెరీర్‌కు మీరు సమయం ఇవ్వాల్సిందే. లేకపోతే అవి దక్కవు. ప్రేమకు అసలైన పరీక్ష ఏంటో చెప్పే సినిమా ఇది' అని అన్నారు. 'ఇది టీనేజ్ వారికి బాగా నచ్చే సినిమా' అని హీరో విక్రమ్ సహిదేవ్ చెప్పారు.