Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆస్త సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై విశ్వాంత్, గోపిక ఉదయన్ జంటగా ఓ సినిమా రూపొందుతోంది. కులదీప్ కుమార్ రజన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సిరి సమర్పణలో దేవు సత్యనారాయణ, ప్రతాప్ రెడ్డి అధురి, షేక్ రహీమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకుల్ని మెప్పించే సరికొత్త కథతో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఆర్ఆర్ ధవన్ సంగీతం సమకూరుస్తున్నారు. కులదీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతోపాటు స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు.
ఈ చిత్రానికి డిఓపి : రవిమణి కె. నాయుడు, ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్, రైటర్: ఆదిత్య భార్గవ్.