Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కౌండిన్య ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్ లోవ, లక్ష్మి కిరణ్, హరీష్ బొంపల్లి, మంజీర ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'ఓసీ'. కిరణ్, విష్ణు దర్శకులు. విష్ణు శరణ్ బొంపల్లి నిర్మాత. బుధవారం ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అగ్ర దర్శకుడు వి.వి. వినాయక్ ముహూర్తపు షాట్‌కి క్లాప్ నివ్వగా, ముని రాజ్ గుత్తా కెమెరా స్విచ్చాన్ చేశారు. సత్య మాస్టర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు కిరణ్ లోవ మాట్లాడుతూ,'ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో హీరోగా 18 చిత్రాలు చేశాను. ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా డైరక్షన్ కూడా చేస్తున్నా. దీన్ని బ్లాక్ బస్టర్ చిత్రంగా రూపొందించడానికి శాయశక్తులా కషి చేస్తాను. విషయం ఉన్నోడు విలేజ్‌లో ఉన్నా ఏదైనా సాధించగలడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. మరో రెండు వారాల్లో షెడ్యూల్ ప్రారంభిస్తాం. షూటింగ్ మొత్తం హైదరాబాద్‌లోనే ఉంటుంది' అని అన్నారు. 'ఈ సినిమాతో నా సోదర సమానుడైన కిరణ్‌ని స్టార్ హీరోగా నిలబెడుతూ, బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. కథే హీరోగా ఈ సినిమా ఉంటుంది' అని నిర్మాత విష్ణు శరణ్ బొంపల్లి చెప్పారు.