Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా 'సన్ ఆఫ్ ఇండియా'. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాని ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు డైమండ్ రత్నబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'భిన్న కోణాల్లో భిన్న అంశాలపై సమాజాన్ని ప్రశ్నించే ఓ వ్యక్తి కథే ఈ సినిమా. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలోని లొసుగులను ప్రశ్నించే విరూపాక్ష పాత్రలో మోహన్‌బాబుగారి నట విశ్వరూపం మరోమారు చూస్తారు. ఆయన సినిమాలంటే వేరేచెప్పక్కర్లేదు. కచ్చితంగా అద్భుతమైన డైలాగులు ఉంటాయి. అలాగే ఇందులోనూ అదిరిపోయే డైలాగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో 'పుణ్యభూమి నాదేశం', 'రాయలసీమరామన్నచౌదరి' వంటి సినిమాల్లోని పవర్ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో ఉంటాయి. అలాగే రఘువీర గద్యం హైలెట్ అవుతుంది. మోహన్‌బాబుగారి పాత్రకి చిరంజీవిగారు వాయిస్ ఓవర్ ఇవ్వడం అదష్టంగా భావిస్తున్నాను. ఇళయరాజా వంటి గొప్ప లెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి పని చేయడం సంతోషంగా ఉంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే చిత్రమిది. ఈ సినిమా ప్రారంభాన్ని మాత్రం ఎవ్వరూ మిస్ కావద్దు. త్వరలో మోహన్‌బాబు, మంచులక్ష్మీ కాంబినేషన్లో ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాను' అని తెలిపారు.