Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా రూపొందబోయే నూతన చిత్రం 'దసరా' బుధవారం రోజు సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. కీర్తి సురేష్ నాయికగా నటిస్తున్న ఈచిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథులుగా సుకుమార్, తిరుమల కిషోర్, వేణు ఉడుగుల, శరత్ మండవ తదితరులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ముహూర్తం షాట్‌కు దర్శకుడు శ్రీకాంత్ తండ్రి చంద్రయ్య కెమెరా స్విచాన్ చేయగా, కీర్తి సురేష్, తనపై నాని క్లాప్ కొట్టారు. తిరుమల కిషోర్, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ ఓదెల స్క్రిప్ట్‌ను చిత్ర బందానికి అందజేశారు.
గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌లో ఉన్న ఒక గ్రామంలో జరిగే కథలో నాని మాస్ యాక్షన్, ప్యాక్డ్ పాత్రను పోషించబోతున్నారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్ర గ్లింప్స్‌కి మంచి ఆదరణ లభించిందని, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి ఆరంభం కానుందని చిత్ర బృందం తెలిపింది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత : సుధాకర్ చెరుకూరి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, సంగీతం: సంతోష్ నారాయణన్, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజరు చాగంటి, దర్శకత్వం : శ్రీకాంత్ ఓదెల.