Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా 'వర్జిన్ స్టోరి'. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మించారు. నేడు (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలోని 'వర్జిన్ స్టోరీ' అంటూ సాగే కొత్త పాటని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురువారం విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'స్టోరీకి తగ్గట్టే టైటిల్ ఉంది. సాంగ్ చాలా బాగుంది. అందరికి మంచి సక్సెస్ రావాలి' అని చెప్పారు. 'పాటల ఛాయిస్‌లో దర్శకేంద్రుడికి మంచి టేస్ట్ ఉంటుంది, ఆయనకి ఈ పాట నచ్చిందంటే అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని నిర్మాత లగడపాటి శ్రీధర్ అన్నారు.