Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్‌లోని ఒక సాప్ట్వేర్ ఉద్యోగి జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం 'డస్టర్ 1212'. శుభకరి క్రియేషన్స్, వి.యస్.ఆర్ మూవీస్ బ్యానర్స్ పై అథర్వా (వాల్మికీ ఫేమ్), మిష్టి, అనైకాసోటి నటీనటులుగా బద్రీ వెంకటేష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
మరిపి విద్యాసాగర్ (వినరు), విసినిగిరి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం ఫిల్మ్ ఛాంబర్లో సినీ అతిరథుల సమక్షంలో ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. చిత్ర నిర్మాత విసనగిరి శ్రీనివాసరావు, 'సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం ఉన్న ఈ కథ నచ్చడంతో వినరు గారితో కలిసి ఈ సినిమా తీశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఫ్యామిలీ అందరూ కలిసి చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇందులోని పాటలు చాలా బాగా వచ్చాయి' అని తెలిపారు.
'తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేశాం. మార్చి 4న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం' అని మరో నిర్మాత నిర్మాత మరిపి విద్యాసాగర్ చెప్పారు. ఈ చిత్రానికి డైరెక్టర్ : బ్రది వెంకటేష్, డైలాగ్స్ : రాజశేఖర్‌రెడ్డి, మ్యూజిక్ : యువన్ శంకర్‌రాజా, ఎడిటర్ : జానకిరామ్.