Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతన గాయనీగాయకుల కలల్ని సాకారం చేసుకునే వేదికగా జీ తెలుగు సింగింగ్ రియాలిటీ షో 'స రి గ మ ప' నిలిచిందని వేరే చెప్పక్కర్లేదు. యువతరంలోని నూతన ప్రతిభను ప్రోత్సహించేందుకు 'స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్' అంటూ మరో కొత్త సీజన్‌తో జీ తెలుగు సందడి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రాబోయే ఆదివారం, (ఈనెల 20, సాయంత్రం 6 గంటలకు) ఈ షో ఆరంభం కానుంది.
ఈ సీజన్‌కి మ్యూజిక్ డైరెక్టర్ కోటి, ఎస్.పి.శైలజ, స్మిత, గీత రచయిత అనంత శ్రీరామ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ వైవిధ్యాన్ని, కంటెస్టెంట్స్ ప్రతిభను, వారి కథల్ని వీక్షకుల ముందుకు తీసుకురావడానికి యాంకర్ శ్రీ ముఖి ఆధ్వర్యంలో ఈ షో సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా చీఫ్ కంటెంట్ ఆఫీసర్ - తెలుగు, అనురాధ గూడూరు ఈ షో గురించి మాట్లాడుతూ, ''స రి గ మ ప' ఒక షో మాత్రమే కాదు. ఎంతో మంది తలరాతల్ని మార్చిన వేదిక కూడా. అలాగే జీ తెలుగు వినోదం పంచిపెట్టడంలో ఎప్పుడూ వెనకాడదు. అభిమానుల కోసం తననితాను ఎప్పుడూ మార్చుకుంటూనే ఉంటుంది. అందుకే ఈసారి కూడా అబ్బురపరిచే విధంగా సెట్స్‌తో పాటు, స్టార్ హీరోయిన్ పూజ హెగ్డేను స్పెషల్ గెస్ట్‌గా లాంచ్ ఎపిసోడ్‌కి ఆహ్వానించాం. సుమంత్, వర్షిణి కూడా సర్ప్రైజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ షో ప్రోమో విడుదల చేసిన వెంటనే కర్నూల్‌కి చెందిన దాసరి పార్వతి, ఈస్ట్ గోదావరికి చెందిన డేనియల్, కడపకి చెందిన వినోద్ స్టార్స్ అయిపోయారు. వీళ్లతో పాటే ఇంకొంత మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారి కథలు, సంగీత ప్రయాణం ఎలా ఉంటుందో ఈ షోని వీక్షించి మీరూ తెలుసుకోండి' అని చెప్పారు.