Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చూసి చూడంగానే' సినిమాతో తెరంగేట్రం చేసిన యువ కథానాయకుడు శివ కందుకూరి. నటుడిగా గుర్తింపు పొందిన ఆయనకు 'గమనం' సినిమా మరింతగా పేరు తెచ్చింది. నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు అయినప్పటికీ తానేంటో నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఉన్నానని అంటున్నారు శివ కందుకూరి.
నేడు (శుక్రవారం) శివ కందుకూరి పుట్టినరోజు.
ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడుతూ, 'సినిమా చేయాలంటే కథ, క్యారెక్టర్లో పర్ఫస్ ఉండేలా చూస్తాను. అలా ఎంపిక చేసుకుందే 'గమనం' సినిమా. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఆదరించారు. దీంతో నేను ఎంచుకున్న విధానం కరెక్ట్ అనిపించింది. ఏదో ఇండిస్టీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా అని ఏది పడితే అది చేయకూడదు. ప్రేక్షకులు మనల్ని నిశితంగా గమనిస్తూనే ఉంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీ వచ్చాక స్పానిష్‌తోపాటు పలు దేశాల సినిమాలను చూసి బాగా ఎనలైజ్ చేస్తున్నారు. అందుకే నటులుగా మేం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నా కెరీర్లో అర్థవంతమైన సినిమాలు చేయాలన్నది నా లక్ష్యం. కమర్షియల్ సినిమాలు చేసినా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు, ఆర్గానిక్ సినిమాలే చేస్తాను. నేను నటించిన 'మను చరిత్ర' ఆర్గానిక్‌గా ఉండబోతోంది. క్యారెక్టర్ జర్నీ, స్టోరీ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. నా కెరీర్ ప్రారంభంలోనే 'గమనం' సినిమా ద్వారా చారుహాసన్, ఇళయరాజా, సినిమాటోగ్రాఫర్ విఎస్ జ్ఞానశేఖర్ వంటి సీనియర్లను గమనించి, నేను చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా పనిపట్ల వాళ్ళు ఎంత డేడికేటెడ్గా ఉంటారో తెలుసుకున్నా. ప్రస్తుతం యూత్ హీరోల్లో భారీ పోటీ ఉంది. అయితే అది పాజిటివ్ కోణంలో ఉండటం విశేషం. ప్రతి ఒక్కరూ కథాపరంగా విభిన్నంగా ఏదైనా చేయాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుతం నటిస్తున్న 'మను చరిత్ర' చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. దీంతోపాటు ఓ క్రైమ్ థ్రిల్లర్ కూడా చేస్తున్నాను. నూతన దర్శకుడు పురుషోత్తం రాజ్ దీనికి దర్శకుడు. స్టార్ హీరో నాని గారు నిర్మిస్తున్న 'మీట్ క్యూట్' వెబ్ సినిమాలోనూ నటించాను. మరో వెబ్ సిరీస్ కూడా చర్చల్లో ఉంది' అని తెలిపారు.