Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లేటెస్ట్ జెనరేషన్ స్పైడర్ మ్యాన్‌గా లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న టామ్ హౌలెండ్ నటించిన తాజా చిత్రం 'అన్ ఛార్టెడ్'. ప్రపంచ ప్రఖ్యాత అన్ ఛార్టెడ్ అనే వీడియో గేమ్ ఆధారంగా హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) థియేటర్లలో విడుదలవుతోంది. ట్రెజర్ హంట్ నేపథ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్ స్టూడియోస్ నిర్మించింది.
'స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్‌తో పాటు ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే సినీ అభిమానులందర్నీ ఈ సినిమా కచ్చితంగా అలరిస్తుంది. ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం హీరో టామ్ హౌలెండ్ వందల అడుగుల ఎత్తులో నుండి ఎలాండి డూబ్ లేకుండా నటించిన తీరు ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది' అని మేకర్స్ తెలిపారు.