Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న 153వ సినిమా 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యింది. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు మోహన్‌రాజా, నాయిక నయనతార ఫోటోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. అలాగే నయనతార పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమా కోసం సాంకేతిక పరంగా అత్యున్నత స్థాయి టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా, సంగీత సంచలనం తమన్, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాఘవన్ ఈ చిత్రానికి బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు.