Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశేష ప్రేక్షకాదరణతో మంచి విజయాన్ని సాధించిన తాజా చిత్రం 'డిజె టిల్లు'. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. దీనికి దర్శకుడు విమల్ కష్ణ. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమా గత శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చి, ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా 'డిజె టిల్లు' బ్లాక్ బస్టర్ వేడుకల్ని విశాఖ గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రబందానికి జ్ఞాపికల్ని మేకర్స్ బహూకరించారు.
దర్శకుడు విమల్ కష్ణ మాట్లాడుతూ, 'ఈ చిత్రంతో ప్రేక్షకులు మాకు గొప్ప విజయాన్ని అందించారు. మీరు ఇచ్చింది సక్సెస్ మాత్రమే కాదు ఒక కొత్త జీవితం. ఓవర్సీస్ సహా మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ కతజ్ఞతలు' అని చెప్పారు. 'మా 12 ఏండ్ల కల ఈ సాయంత్రం నిజమైంది. మాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. ఆ సినిమాలతోనే అనుకున్నది సాధించాలని అనుకున్నాం. మా సినిమాని బ్లాక్‌బస్టర్ చేశారు. ఈ జర్నీలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకునే వ్యక్తి మా నిర్మాత వంశీ. మమ్మల్ని నమ్మి ఈ సినిమా ఇచ్చారు' అని హీరో సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు.
హీరోయిన్ నేహాశెట్టి మాట్లాడుతూ, 'మా సినిమా మీకు ఇంత బాగా నచ్చినందుకు సంతోషంగా ఉంది. నా సక్సెస్ జర్నీ వైజాగ్ నుంచే నుంచే మొదలైంది. రాధిక పాత్రను నేను సరిగ్గా పోషించగలను అని నమ్మిన దర్శకుడు విమల్, నిర్మాత నాగవంశీ గారికి కతజ్ఞతలు' అని అన్నారు. 'మా చిత్రానికి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కతజ్ఞతలు. మా సంస్థకు మరో మంచి సక్సెస్ ఇచ్చారు' అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు.