Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహంకాళి మూవీస్ పతాకం పై కౌషల్ మండా, లీషా ఎక్లైర్స్ హీరో, హీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'రైట్'. మహంకాళి దివాకర్, లుకలాపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై, విజయవంతమైన 'మెమోరీస్' చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను అగ్ర కథానాయకుడు వెంకటేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'జీతూ జోసఫ్ కథ అందించిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించాలి. మోషన్ పోస్టర్ చాలా బాగుంది. కౌషల్‌కి ఈ సినిమా సక్సెస్ కావాలి' అని చెప్పారు. ''బిగ్ బాస్' విన్ అయిన తర్వాత ఈ సినిమా చేశాను. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. మీరందరూ నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఉంటాను. ఈ సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. త్వరలో థియేటర్లలో విడుదల అవుతుంది' అని హీరో కౌషల్ మండా అన్నారు.
నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ, 'కౌషల్ మండా హీరోగా నటించిన మా చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్‌గారికి కతజ్ఞతలు. షూటింగ్ అంతా పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. మా దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు' అని తెలిపారు. 'ఓ మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. కౌషల్ అద్భుతంగా నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని మరో నిర్మాత లుకలాపు మధు చెప్పారు.