Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతాప్ పోతన్, అరవింద్ కష్ణ, అలీ రెజా, ఊర్వశీరారు ప్రధాన పాత్రల్లో నటించిన స్పై థ్రిల్లర్ 'గ్రే'. అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజ్ మదిరాజు దర్శకుడు. కిరణ్ కాళ్లకూరి నిర్మాత. 'ద స్పై హూ లవ్డ్ మి' అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ, 'ఐదారేళ్ల క్రితం మనదేశంలో రెండేళ్ల వ్యవధిలో దాదాపు 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారు. గతంలో కూడా ఇలా చాలా సార్లు జరిగింది. దీనికి కారణం ఏంటని తెలుసుకున్న అంశాల నుంచి పుట్టిన ఐడియానే ఈ సినిమా. సాధారణంగా మంచిని తెలుపుగాను, చెడును నలుపుగాను చూస్తుంటాం. కాని ఆ రెండు కలర్స్ మధ్యలో కొన్ని వందల షేడ్స్ ఉంటాయి. ప్రతి ఆలోచన వెనుక మన ఆలోచనలకు కూడా అందని కొన్ని వింతైన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అదే గ్రే..ఒక స్పై డ్రామా. సినిమా చాలా బాగా వచ్చింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో వస్తున్న చిత్రమిది' అని తెలిపారు.'ఈ సినిమాతో ఎంతో మంది మంచి నటీనటులు, టెక్నీషియన్లు ఇండిస్టీకి పరిచయమవుతున్నారు. అద్వితీయ మూవీస్ ముఖ్య ఉద్దేశ్యం కూడా అదే. మా బ్యానర్లో మరో మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. రెండు గంటలు హ్యాపీగా చూసే చిత్రం 'గ్రే'' అని నిర్మాత కిరణ్ కాళ్లకూరి అన్నారు.