Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఓ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. మా హీరో రామ్‌తో 'ది వారియర్' తర్వాత సినిమాగా ఇది కుదరడం మరింత హ్యాపీగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమాని విడుదల చేస్తాం. మా బ్యానర్‌కు ఇది చాలా ప్రెస్టీజియస్ మూవీ. ఈ సినిమాని కూడా భారీ స్థాయిలో, ఉన్నత నిర్మాణ విలువలతో తీస్తాం' అని చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: పవన్ కుమార్.