Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకాశ్‌రాజ్, నవీన్‌చంద్ర, కార్తీక్‌రత్నం కీలకపాత్రల్లో నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం శుక్రవారం రామానాయుడు స్టూడియోలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
శ్రీ అండ్ కావ్య సమర్పణలో ప్రొడక్షన్ నం 6గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని థింక్ బిగ్ బ్యానర్‌పై 'తలైవి' దర్శకుడు ఎ.ఎల్ విజరు, శ్రీ షిరిడిసాయి మూవీస్ అధినేత యం.రాజశేఖర్ రెడ్డి, ప్రకాశ్‌రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రకాశ్‌రాజ్, శ్రీక్రియేషన్స్‌పై బి.నర్సింగరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో వాలీ మోహన్‌దాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు తనికెళ్ల భరణి పూజచేసి, నిర్మాతలను ఆశీర్వదించటంతో సినిమా ఆరంభమైంది. దర్శకుడు వేగేశ్న సతీష్, రచయిత జనార్ధన మహర్షి, సంగీత దర్శకులు ఆర్.పి పట్నాయక్ చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను దర్శకుడు వాలీ, నిర్మాతలు విజరు, రాజశేఖర్‌కి అందించారు. హీరో నవీన్‌చంద్ర, కార్తీక్ రత్నంలపై చిత్రీకరించిన తొలి షాట్‌కు నటుడు అలీ క్లాప్ కొట్టగా, నిర్మాత సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ్ కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కు 'ఆర్ ఎక్స్ 100' ఫేమ్ అజరు భూపతి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత యం.రాజశేఖర్ మాట్లాడుతూ,'నేను చెప్పిన కథను నమ్మి నాతో ట్రావెల్ చేయటానికి ముందుకొచ్చిన ప్రకాశ్‌రాజు గారు, ఏ.ఎల్ విజరు గారు, నవీన్‌చంద్రకి థ్యాంక్స్' అని చెప్పారు.
'ఈ సినిమా కథ చాలా స్పెషల్. ఈ కథతో ఎంతో మంది నిజ జీవితంలో ఇన్స్ఫైర్ అవుతారు. ఇలాంటి మంచి కథతో నా దగ్గరికి వచ్చిన దర్శకుడు వాలీకి, చక్కని కథలను తెరకెక్కించే నిర్మాత రాజశేఖర్ అన్నకి థ్యాంక్స్' అని హీరో నవీన్‌చంద్ర అన్నారు. నటుడు కార్తీక్ రత్నం మాట్లాడుతూ,'దర్శకుడు వాలీ కథను ఎంతో కొత్తగా రాసుకున్నారు. నేను నటించిన 'కేరాఫ్ కెంచెరపాలెం' సినిమాను నిర్మాత రాజశేఖర్ గారు తమిళంలో 'కేరాఫ్ కాదల్'గా తెరకెక్కించి నన్ను కోలీవుడ్‌కి కూడా పరిచయం చేశారు. ఈ సినిమాతో ఆయన పెద్ద విజయం సాధిస్తారు' అని తెలిపారు. 'రాజశేఖర్‌గారు చెప్పిన కథ నచ్చటంతో పెద్ద సినిమా అవుతుందనే నమ్మకంతో ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాను' అని విజరు అన్నారు. వాణీబోజన్, అమతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : గురుదేవ్, ఎడిటర్: సతీష్, ఆర్ట్: హరిబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శివమల్లాల.