Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా 'చోర్ బజార్'. గెహన సిప్పీ హీరోయిన్. 'దళం', 'జార్జ్‌రెడ్డి' చిత్రాల దర్శకుడు జీవన్ రెడ్డి దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ను శుక్రవారం అగ్ర హీరో రామ్ పోతినేని రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ, ''చోర్ బజార్' టైటిల్ సాంగ్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. పాట చాలా ట్రెండీగా ఉండి. గల్లీ బార్సు పాటలా అనిపించింది. ఆకాష్ క్యారెక్టరైజేషన్, యాటిట్యూడ్ అదిరిపోయినట్లు పాటతో తెలుస్తోంది. రెగ్యులర్ పాటలా కాకుండా ర్యాప్‌తో నేటి ట్రెండీ సాంగ్లా చేయటం విశేషం. ఫొటోగ్రఫీ చాలా బాగుంది. ఆకాష్ హిట్ కొడతాడని నమ్మకంగా చెబుతున్నా. ఇలాగే ట్రెండ్ సెట్టర్స్‌గా ఆకాష్ సినిమాలు చేస్తూ ఉండాలి' అని అన్నారు.
మీకు దిల్ ఉన్నోళ్ల కథ చెప్పాలె..దిల్ నిండా దమ్మున్నోళ్ల కథ చెప్పాలె..ఇది చోర్ బజార్...ఆజా చోర్ బజార్..అంటూ రాప్ స్టైల్లో సాగిన ఈ పాట మంచి ఎనర్జీతో సాగుతూ హీరో క్యారెక్టరైజేషన్‌ను వివరించింది. నవాబ్ గండ్, అసురన్ టీమ్ ఈ పాటకు సంగీతాన్ని, ర్యాప్ అందించి, పాడారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి, సంగీతం : సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ : అన్వర్ అలీ- ప్రభు దేవా, ఆర్ట్ : గాంధీ నడికుడికర్, సహ నిర్మాత : అల్లూరి సురేష్ వర్మ, రచన, దర్శకత్వం :బి. జీవన్ రెడ్డి.