Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమన్నా కథానాయికగా బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ 'బబ్లీ బౌన్సర్' అనే బాక్సింగ్ నేపథ్యం ఉన్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల జరిగిన పూజా కార్యక్రమాలతో మొదలైంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మధుర్ భండార్కర్ మాట్లాడుతూ,'గతంలో నేను తెరకెక్కించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. బాక్సర్స్ టౌన్‌గా పేరొందిన అసోలా ఫతైపూర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాని రూపొందిస్తున్నాను. తమన్నా ఈ సినిమాలో మహిళ బౌన్సర్‌గా నటిస్తున్నారు. భారతదేశంలో ఓ మహిళ బౌన్సర్ కథ ఆధారంగా వస్తున్న తొలి సినిమా ఇదే. పాన్ ఇండియా సినిమాగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం' అని తెలిపారు.
'నా కెరీర్లో తొలిసారి ఓ బౌన్సర్ పాత్రలో కనిపించడం చాలా ఆనందంగా ఉంది. ఓ ఛాలెంజ్‌గా తీసుకుని ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాను. మధుర్ దర్శకత్వంలో నటించడం కూడా చాలా ఉత్కంఠగా ఉంది. ఈ సినిమాతో నన్ను ప్రేక్షకులు మరింతగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అని నాయిక తమన్నా చెప్పారు.