Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చైల్డ్ ఆర్టిస్ట్‌గా 80కి పైగా సినిమాలు చేసిన సాత్విక్ వర్మను 'బ్యాచ్'తో హీరోని చేసినందుకు హ్యాపీగా ఉంది' అని నిర్మాత రమేష్ గనమజ్జి అన్నారు. బేబీ ఆరాధ్య సమర్పణలో ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకంపై సాత్విక్ వర్మ, నేహా పటాన్ జంటగా శివ దర్శకత్వంలో రమేష్ గనమజ్జి నిర్మించిన చిత్రం 'బ్యాచ్'. రఘు కుంచె సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్స్‌లో విడుదలై, విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.
చిత్ర నిర్మాత రమేష్ ఘనమజ్జి మాట్లాడుతూ, 'సినిమా ఇంత సక్సెస్ కావడానికి ప్రధాన కారణం మాటీమ్. రఘు కుంచె మంచి సంగీతం అందించారు. కొత్త సింగర్స్‌తో పాడించి, వాళ్ళని ఇండిస్టీకి పరిచయం చేయటం ఆనందంగా ఉంది. ఈ సినిమా తరువాత దర్శకుడు శివకు ఇండిస్టీలో మంచి బ్రేక్ వస్తుంది. సాత్విక్‌కి ఈ సినిమాతో మంచి లాంచింగ్ దొరికినందుకు గర్వంగా ఉంది. మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు' అని చెప్పారు.
'ఇలాంటి మంచి కథకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు. ప్రేక్షకుల ఆదరణ వల్లే ఈ రోజు మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని దర్శకుడు శివ తెలిపారు.
హీరో సాత్విక్ మాట్లాడుతూ, 'సీనియర్ ఆర్టిస్టులు అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్' అని అన్నారు.