Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన సినిమా 'వర్జిన్ స్టోరి'. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సౌమిక పాండియన్ నాయికగా నటించింది. ప్రదీప్. బి అట్లూరి దర్శకత్వం వహించారు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా యువ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని చిత్ర బందం తెలిపింది. ఈ సందర్భంగా శనివారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ, 'ఈ చిత్రంతో ఒక కొత్త ప్రయత్నం చేశామని అభినందిస్తున్నారు. రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. అవకాశం ఉన్నా ఎక్కడా అసభ్యత చూపించలేదని యూఎస్ నుంచి మిత్రులు కాల్ చేసి ప్రశంసిస్తున్నారు టీనేజ్‌లో ఉన్న వాళ్లకు మా సినిమా కంటెంట్ బాగా అర్థమవుతుంది. సినిమాకి విజయాన్ని అందించి మమ్మల్ని, మా టీమ్‌ను ప్రోత్సహించిన అందరికీ కతజ్ఞతలు' అని అన్నారు.
'క్లీన్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చేశాం. యూత్ నుంచి రెస్పాన్స్ బాగుంది. కామెడీలో చాలా రకాలు ఉంటాయి. మేము విభిన్నంగా ఎంటర్టైన్మెంట్ ఇద్దామని ప్రయత్నించాం. మంచి రివ్యూస్ వచ్చాయి. ఆడియెన్స్ నుంచి ఇంకా మంచి స్పందన ఎక్స్పెక్ట్ చేస్తున్నాం' అని దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి చెప్పారు. నాయిక సౌమిక పాండియన్ మాట్లాడుతూ, 'నేను పియూ అనే పాత్రలో నటించగలనని నమ్మిన దర్శకుడు ప్రదీప్ గారికి థ్యాంక్స్. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నా క్యారెక్టర్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాను. కానీ కొన్ని సీన్స్ పూర్తయ్యాక నేను బాగానే నటించానని నమ్మకం కలిగింది. కొత్త ప్రయత్నం చేసిన మా చిత్రాన్ని మరింతగా ఆదరించండి' అని తెలిపారు.