Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అజిత్ కథానాయకుడిగా హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వలీమై'. ఈ చిత్రం ఈనెల 24న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా ఇందులో ప్రతినాయకుడి పాత్ర పోషించిన కార్తికేయ శనివారం మీడియాతో మాట్లాడుతూ, 'దర్శకుడు వినోద్ ఈ కథ నెరెట్ చేస్తూ, ఇందులో మీరు చేయాల్సింది ప్రతినాయకుడిగా పాత్ర అని చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. పైగా అజిత్ వంటి స్టార్ హీరో సినిమాలో పవర్ఫుల్ విలన్ రోల్ అంటే అంత ఈజీగా కాదు. టగ్ ఆఫ్ వార్‌గా ఉంటుందని నమ్మాను. నా నమ్మకాన్ని నిజం చేస్తూ సినిమాలో నాపాత్ర చాలా బాగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను విలన్‌గా నటించిన నాని 'గ్యాంగ్‌స్టర్' చిత్రంలో నా పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇందులో నా పాత్ర పూర్తి స్థాయిలో ఉంటూ మల్టీ లేయర్‌గా ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది. ఇక అజిత్ సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చాలా హూందాగా ఉంటారు. ఆయనకు బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయనకు బైక్ యాక్సిడెంట్ జరిగి, గాయాలైనా సరే.. షూటింగ్‌కి వచ్చారు. ఆయనతోపాటు నేనూ బైక్ రేసింగ్‌లో పాల్గొనే సన్నివేశాలు చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందుకే దీన్ని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. గతంలో చేసిన తప్పుల్ని మళ్ళీ రిపీట్ చేయకుండా కథల్ని ఎంపిక చేసుకుంటున్నా. ప్రస్తుతం ప్రశాంత్ అనే నూతన దర్శకుడితో యువి క్రియేషన్స్ పతాకంపై ఓ సినిమా, శ్రీ దేవి మూవీస్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాను. అజరు భూపతితో ఓ ద్విభాషా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అలాగే సుకుమార్‌గారి సంస్థలో ఓ సినిమా ఉండే ఛాన్స్ ఉంది' అని చెప్పారు.